ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్ కు అభివృద్ధి గుర్తుకొస్తది – బిజెపి రంగారెడ్డి ‌అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ఉప‌ ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కు అభివృద్ధి గుర్తుకు వస్తుందని, ఎక్కడ‌ ఉప ఎన్నిక‌ జరిగితే‌‌ అక్కడ టీఅర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి మంత్రం‌ జపిస్తుందని బిజెపి రంగారెడ్డి ‌అర్బన్‌ జిల్లా‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఎద్దేవా చేశారు. చందానగర్ లోని స్వాగత్ హోటల్ లో శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని బిజెపి ముఖ్య నాయకుల సమావేశం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్అధ్యక్షతన నిర్వహించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే కాని అభివృద్ధి గురించి గుర్తుకురాని మొద్దు నిద్రలో కేసీఆర్ ఉన్నారన్నారు.‌

బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న సామ రంగారెడ్డి

ఇప్పటివరకు మునుగోడు వైపు చూడని కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తో ఉప ఎన్నిక‌ వస్తుందనే‌ భయంతో అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికి జిత్తులు వేస్తున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ మాయమాటలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ఆగస్ట్ 21 వ తేదీన మునుగోడు లో జరిగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి బిజెపి కార్యకర్తకు పిలుపునిచ్చారు, మునుగోడులో జరిగే ఉప ఎన్నిక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని, కావున బిజెపిని భారీ మెజారిటీ తో గెలిపించి ఫైనల్ లో బిజెపి సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్, రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ, డా. కె నరేష్, రవికుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, బొబ్బ నవతరెడ్డి, కాంచన కృష్ణ, వసంత్ కుమార్, జానకి రామరాజు, రమేష్ సోమిశెట్టి, మారం వెంకట్, కుమార్ యాదవ్, మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here