శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో ప్రపంచ సంగీత దినోత్సవం ( వరల్డ్ మ్యూజిక్ డే ) సందర్భాంగా గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం, తబలా కళాకారులూ ప్రదర్శనలు ఇచ్చారు. కీర్తన శిష్య బృందం కర్ణాటక గాత్రం , శేషం రమణ శిష్య బృందం వేణువుపై, విద్యాసాగర్ శిష్య బృందం మృదంగంపై, రాధికా శ్రీనివాసన్ శిష్య బృందం వయోలిన్ పై, శాంతి చంద్రిక శిష్య బృందం వీణపై, ప్రకాష్ శిష్య బృందం తబలాపై అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు, శ్రీ రామదాసు సంకీర్తనలు, మొదలైన పాటలతో అలరించారు. గురువులందరిని గౌరవంగా సత్కరించారు.