శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ ప్రొఫెసర్స్ కాలనీలో రూ.75.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, కార్పొరేటర్లు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతాలలోప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM శరత్ రెడ్డి, మేనేజర్ సందీప్, నాయకులు ఉట్ల కృష్ణ, తిరుపతి రెడ్డి, ఉట్ల దశరథ్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, రమేష్ పటేల్, రజినీకాంత్, తిరుపతి యాదవ్, కరీం, అక్షయ్, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.