శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 1 & 2 అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు యువ నాయకుడు నిమ్మల ధాత్రినాథ్ గౌడ్ సొంత నిధులు రూ. 4 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జనప్రియ నగర్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ధాత్రి నాథ్ గౌడ్ తన సొంత నిధులతో రూ.4 లక్షలు వెచ్చించి 32 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ధాత్రి నాథ్ గౌడ్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికి, ఇతర కాలనీలకు ధాత్రినాథ్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరు ఎంతో కొంత దాతృత్వం చేయాలని, సమాజ హితం కోసం పాటుపడాలని అన్నారు.

కాలనీలలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని అన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై కాలనీ వాసులకు విస్తృత ప్రచారంతో అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వలన కేసుల పరిష్కారం సులువు అవుతుందని, నేర శోధన , నేర నివారణకు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కనుక అన్ని కాలనీల వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SI మాణిక్యం, జనప్రియ నగర్ ఫేస్ 1 ప్రెసిడెంట్ జయసూర్య, మల్లికార్జున్, సుధాకర్, దాసు , ప్రవీణ్, శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






