నమస్తే శేరిలింగంపల్లి: మహా శివరాత్రి పర్వదినం మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లోని శివాలయంలో వేడుకగా జరిగింది. ఈ దేవాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు, పరమేశ్వరునికి అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి గోపి,పూర్ణచందర్ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ రావు శివ, భక్తులు, ఆచార్యులు, మరియు తదితరులు పాల్గొన్నారు.