కిందికుంట పార్క్ లో ఘ‌నంగా మ‌హిళ‌ల అట్ల‌తద్ది వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో కిందికుంట పార్క్ వాకర్స్ అసోసియేషన్, ప‌రిస‌ర ప్రాంత‌ కాలనీల మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన అట్లతద్ది కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హిందూ పురాణాల్లో అట్లతద్ది పండుగకి విశేషమైన ప్రాధాన్యం ఉంది అని అన్నారు. ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ అట్లతద్ది జరుపుకుంటార‌ని, దీనినే ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని కూడా అంటార‌న్నారు. ఉత్తారాది వాళ్లు కర్వా చౌత్‌ (Karwa Chauth )గా జరుపుకుంటార‌ని అన్నారు. ఈరోజున ప్రధానంగా గౌరీదేవిని ఆరాధిస్తార‌ని, కింది కుంట పార్క్ లో మహిళలు అంగరంగ వైభవంగా అట్లతద్ది కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here