శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ మసీదుబండలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి డివిజన్ కు సంబంధించిన వివిధ మోర్చాల అధ్యక్షులను, జనరల్ సెక్రెటరీలను కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ నియమించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ అధ్యక్షుడు కిషోర్ ముదిరాజ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, మాజీ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమఆధ్వర్యంలో నూతనంగా నియామకం అయిన వారికి రవికుమార్ యాదవ్ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బాధ్యతలు పొందిన ప్రతి ఒక్కరూ విధిగా ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రతి బూతులో దాదాపు 600 మందిని నేరుగా కలిసి వారికున్న సమస్యలను , ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. ప్రజలను భారతీయ జనతా పార్టీ వైపు చూసే విధంగా ఆకర్షించాలని అన్నారు. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో శేరిలింగంపల్లి డివిజన్‌లో కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. శేరిలింగంపల్లి డివిజన్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విజయలక్ష్మి, మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్లు గా మాధవి , నాగమణి , వరలక్ష్మి , డివిజన్ జిఎస్ గా సత్యవాణి, BJYM ప్రెసిడెంట్ గా మహేష్, డివిజన్ ట్రెజరర్ గా ఆలకుంట అజయ్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్లుగా వికాస్, భార్గవ్ విజయ్, గౌతమ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా అరవింద్ ని నియమించారు.






