ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స‌తీమణి రాగం సుజాత యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ లోని త‌మ నివాసంలో కుటుంబ సమేతంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచ‌రించారు. ఈ సంద‌ర్భంగా విశేషమైన పుష్పాల‌తో అలంక‌ర‌ణ‌లు చేసి పండితుల‌చే సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వరలక్ష్మి వ్రత వేడుకలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరిపై శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ సీఐ విజయ్, ఆనంద్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు రామ్ మోహన్ రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, శ్రీనివాస్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here