శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): అమాయక ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీ మూకలపై తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ కాలనీ లో నివాసముంటున్న రామకృష్ణ అనే వ్యక్తి ఇంటికి కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు అతని స్థలాన్ని ఖాళీ చేయాలని అతి దారుణంగా కొట్టి బెదిరించి వెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానిక కాలనీవాసులు తెలియజేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న రవికుమార్ యాదవ్ బాధిత వ్యక్తి ఇంటికి వెళ్ళి ఎవరికీ భయపడాల్సిన పనిలేదని , వారికి అండగా తాము ఉంటామని ధైర్యం చెప్పారు. స్థానిక పరిధిలోని సీఐతో మాట్లాడి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్, అరవింద్, మన్యంకొండ, ఆత్మారాం, రాజేందర్, వెంకటేష్, నరసింహ, ప్రవీణ్, రమేష్ పాల్గొన్నారు.






