శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని మంజీర పైప్ లైన్ రోడ్డు, శివాజీ నగర్, భవాని పురం కాలనీ, భవాని పురం వీకర్ సెక్షన్, శంకర్ నగర్, KSR ఎన్క్లేవ్ , ఇక్రిశాట్ కాలనీ, దీప్తి శ్రీ నగర్, అర్జున్ రెడ్డి కాలనీలలో రూ. 3 కోట్ల 33 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాలువ నిర్మాణం పనులకు, పార్క్ ల ప్రహరీ గోడల నిర్మాణం పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర, సంతులిత అభివృద్దే తన ధ్యేయమని అన్నారు. ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. కాలనీలు, బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.






