మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీలో ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు (జై శ్రీ రామ్ యూత్) సుమారుగా 70 మంది డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీ వారికి తెరాస పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా తెరాస పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరే ప్రతి కార్యకర్తను గౌరవిస్తామని అన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణను సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా ఉందామని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుదామని అన్నారు.
తెరాస పార్టీలో చేరిన వారిలో మాదాపూర్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు శేషు, మహేందర్, ప్రసాద్, రవి, బొండం ప్రసాద్, జనార్దన్, శేషు, కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీను, రాంచందర్, సత్య రెడ్డి, సాయి యాదవ్ పాల్గొన్నారు.