నమస్తే శేరిలింగంపల్లి: నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలను, ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారి పై నూతనంగా నిర్మిస్తున్న పాదచారుల వంతెన నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం రోడ్డు దాటే పాదచారుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యక్షంగా ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
దీంతో రోడ్డు దాటే వృద్దులకు, పిల్లలకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా పాదచారుల వంతెనను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, శివప్రసాద్, ఆర్ అండ్ బీ ఈఈ ధర్మారెడ్డి, డీఈ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు ఓ. వెంకటేష్, పులిపాటి నాగరాజు, నరేందర్ బల్లా, హరీష్ రెడ్డి, దాస్, కార్తీక్ గౌడ్, అమిత్ దూబే, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, శంకర్ రావు, అశోక్, వరలక్ష్మి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.