ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరీస్సా జయంతి

నమస్తే శేరిలింగంపల్లి: యుగోస్లేవియా దేశంలో పుట్టి, భారత దేశానికి ఉపాధ్యాయురాలిగా వచ్చిన మదర్ థెరిస్సా సామాజిక సేవల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది మాతృమూర్తిగా నిలిచారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు రాందాస్ అన్నారు. మాదాపూర్ లోని స్వాతి హైస్కూల్ లో భారత రత్న నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిస్సా జయంతి ఉత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రాగం మల్లికార్జున యాదవ్ సౌజన్యంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చిత్రపటానికి పుష్పాంజలితో శ్రద్ధాంజలి ఘటించారు. మానవసేవే మాధవ సేవగా భావించి సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్న గచ్చిబౌలి సత్యసాయి సేవా సంస్థ సభ్యులు సి .శశికిరణ్, ఎం. దీప్తి, కుమారి చందన, గ్రేస్ వృద్ధాశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్, అమ్మానాన్న వృద్ధాశ్రమం నిర్వాహకురాలు శ్రీదేవి సేవారత్న అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు రాందాస్ మాట్లాడుతూ కోల్ కత్తా మురికి వాడలోని అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా అని, తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం అందించి అమ్మగా మారిందన్నారు. కలకత్తాలోని మురికివాడల్లో దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయిన మదర్ థెరిస్సా తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారన్నారు. అనాధ పిల్లల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కలకత్తా నగరంలో జోలె పట్టి, అనాధ పిల్లల కడుపు నింపారన్నారు. ఆమె సేవా నిరతిని గుర్తించి కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించి ఆమెకు బాసట గా నిలిచారని పేర్కొన్నారు. 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి ఈ సంస్థ ద్వారా దాదాపు 45 ఏళ్లలో ఎందరో అభాగ్యులు, పేదలు రోగులకు సేవలు అందించారన్నారు. అనేక అనాధ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ ఐ వి, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి, తన సేవల ద్వారా స్వాంతన చేకూర్చారన్నారు.

గచ్చిబౌలి సేవా సంస్థ సభ్యులను సేవా రత్న అవార్డులతో సన్మానించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ‌కన్వీనర్ రామస్వామి యాదవ్

సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1962లో పద్మశ్రీ, జవహార్ లాల్ నెహ్రూ అవార్డుల వంటి అనేక అవార్డులతో సత్కరించారు. మదర్ థెరిసా తన సేవలను భారతదేశంతో పాటు ఇతర దేశాలకు విస్తరింపజేశారని గుర్తు చేశారు. సుమారు 123 దేశాలలో 610 కేంద్రాల ద్వారా తన సేవలను అందించారని, ఆమె సేవలను గుర్తించి 1979లో నోబుల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారన్నారు. 1980లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించిందని తెలిపారు. నేటి యువతీ యువకులు ఆమె సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకొని, వృద్ధులకు, సమాజంలో అభాగ్యులకు, నిరుపేదలకు, సేవలను అందించాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మానవసేవే మాధవసేవగా భావించే, సేవా తత్పరతను అలవాటు చేయాలని కోరారు.కార్యక్రమంలో రాగం మల్లికార్జున యాదవ్ , స్వాతి స్కూల్ కరస్పాండెంట్ ఫణి కుమార్, సత్యసాయి సేవా సమితి సభ్యులు డాక్టర్ బి సి రామన్న, డి.వి.కె రావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వరరాజు, శివరామకృష్ణ, ఉమా చంద్రశేఖర్, శ్రీదేవి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here