నమస్తే శేరిలింగంపల్లి: స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోని చెత్తను స్వచ్ఛ్ ఆటోలలో వేసేలా చూడాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సూచించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో పారిశుధ్యంపై ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తిక్, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో కార్మికులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించారు. ప్రతీ కాలనీలో ఇంటింటికి వెళ్లి స్వచ్ఛ్ ఆటో కార్మికులు వెళ్లి చెత్తను సేకరించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ కార్తిక్, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ అధికారి సంధ్య, శానిటేషన్ ఎస్ఆర్ పీలు కనకరాజు, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎఫ్ఏలు నాగరాజు, గురు చరణ్, వినయ్, మహేష్, అగమయ్య, డివిజన్ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ్ ఆటో ట్రాలీల కార్మికులు పాల్గొన్నారు.