కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస ప్రభుత్వం క్రిస్టియన్ ల అభ్యున్నతికి కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలోని మౌంట్ కార్మెల్ స్కూల్ లో బెరయ గాస్పెల్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ వేడుకలలో భాగంగా ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ నూతన వస్త్రాలను కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ క్రిస్టియన్లకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రతి మతాన్ని ప్రభుత్వం ఆదరిస్తుందన్నారు. అందులో భాగంగానే బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలను, క్రిస్మస్, రంజాన్ పండుగలకు నూతన వస్త్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, ఏరియా కమిటీ మెంబర్ తిరుపతి యాదవ్, తెరాస నాయకులు తిరుపతి, బెరయ గాస్పెల్ చర్చ్ క్రైస్తవ సంఘ పాస్టర్ జెరెమియ్య, విజయ్ జీవరాజ్, టీఆర్ రాజు, మధు, దివాకర్ బాబు, ఏలీయా, ఆనందబాబు పాల్గొన్నారు.





