కార్పొరేట‌ర్లుగా మ‌ళ్లీ గెలిపించినందుకు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు: పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

మాదాపూర్‌ ‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌జ‌లు త‌మ‌పై న‌మ్మ‌కం ఉంచి త‌మ‌ను మ‌రోసారి కార్పొరేట‌ర్లుగా గెలిపించినందుకు ధ‌న్యవాదాలు తెలుపుతున్నామ‌ని హఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజన్ల కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌లు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తెరాస‌పై న‌మ్మ‌కంతో వారికి సేవ చేసుకునే అవ‌కాశాన్ని మ‌రోసారి క‌ల్పించినందుకు స‌దా రుణ‌ప‌డి ఉంటామ‌ని అన్నారు.

కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ల‌ను స‌న్మానించిన హుడా కాల‌నీ వాసులు

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కార్పొరేట‌ర్లుగా విజ‌యం సాధించినందుకు గాను పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ల‌ను హుడా కాల‌నీ వాసులు శ‌నివారం స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా త‌మ‌ కర్తవ్యాన్ని విస్మరించకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామ‌న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులను క‌ల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుందని అన్నారు. ప్రతి కాలనీ, బస్తీల‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూస్తామ‌న్నారు. అనంతరం మంజీరా రోడ్డులో మంజీర పైప్ లైన్ లీకేజీ పనులను, హుడా కాలనీలో నెలకొన్న మంచి నీటి సమస్యను వాట‌ర్ బోర్డు మేనేజర్ సుబ్రమణ్యం రాజుతో కలసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యుడు శేఖర్ ముదిరాజ్, నాయకులు రాజు, జ్ఞానేశ్వర్, ప్రవీణ్ కుమార్, గోపాల్, శివ, విష్ణు, వెంకట్, నరేష్, రవి, విఘ్నేష్, హుడా కాలనీ వాసులు బాల సుబ్బ‌య్య, గోపాల్ రెడ్డి, నారాయణ రెడ్డి, కోటేశ్వరరావు, రాధాకృష్ణ, నాగేశ్వర్ రావు, ప్రసాద్, రవీంద్ర బాబు, నరేందర్, మోసిన్‌, ఎం.ఎస్.రాజు, పవన్, రంజిత్ రెడ్డి, దేవేందర్, ఉమేష్, అశోక్ గౌడ్, సాయినాథ్, సదాశివ రావు, సురేందర్ రెడ్డి, నాగి రెడ్డి, సాయిబాబా, బసవరాజు, వెంకటేశ్వర రావు, శివ, వంశీ, భాను, శిరీష, మల్లిక‌, ధనలక్ష్మి, జ్యోతి, రోజా, పుష్పలత, రాధ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here