శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషా ముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామారం వరకు చేపడుతున్న ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను డీసీ గంగాధర్, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్ , పారిశుధ్య విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామరం వెళ్లే రోడ్డులో వాహనదారులు నిత్యం ట్రాఫిక్ సమస్య తో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగిందని , అందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, కార్పొరేటర్ తో కలిసి ఉషా ముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర గా స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం జరిగిందని తెలియజేశారు. 100 ఫీట్ రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి, ప్రణాళిక ను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE గోవర్ధన్, AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ , టౌన్ ప్లానింగ్ ACP జిషన్, TPS మధు, నాయకులు కార్యకర్తలు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






