విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారోత్సవంలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించి షీల్డ్ బహుకరించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల నిస్వార్థ సేవలను ప్రశంసిస్తూ, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకపాత్ర అని తెలియజేశారు. తెలంగాణ నినాదాన్ని ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్ళింది టీచర్లని గుర్తు చేశారు. తెలంగాణ సమాన జీవన ప్రయాణానికి దిశానిర్దేశం చేసి గురువులు సమాజ నిర్మాణానికి శిల్పులని అన్నారు. గురువుల ప్రేరణాత్మక సేవ దృక్పథం ప్రజల పట్ల చూపుతున్న కృతనిశ్చయం, గురువుల త్యాగమయమైన ఆత్మను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురుపూజోత్సవం రోజున ప్రతి గురువుకి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు మాజీ కౌన్సిలర్లు సోమదాస్, వీరేశం గౌడ్, కే రాంచందర్, శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి, పీ.ఆర్.టీ.యూ టీ.ఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు శ్యామల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షుడు రాఘవేందర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు బలవంత్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు తాజ్ బాబు బసవలింగం, వసుంధర, శైలజ, పి.ఆర్.టి.యు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతు, రవీందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, కర్ణ, పీ.ఈ.టీ కేశవరెడ్డి, వీరేశం, ఎంపీపీఎస్ గోపినగర్ హెచ్ఎం శివరాజ్, ఎంపీపీఎస్ సురభి కాలనీ హెచ్ఎం పాండురంగారెడ్డి, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ కవిత, రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, మహేష్ చారి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here