శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ శ్రీ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డీసీ బాలకృష్ణ, ట్రాఫిక్ సిఐ శ్రీ సురేష్, GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వైట్ ఫీల్డ్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేయడం జరిగిందని, వైట్ ఫీల్డ్ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలిసి పాదయాత్ర గా వెళ్లడం జరిగిందని, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, పాఠశాలల కు, కళశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE గోవర్ధన్, DE దుర్గాప్రసాద్, టౌన్ ప్లానింగ్ ACP కరుణాకర్, TPS సంతోష్, SWM DE రూపదేవి, AE మన్యం, SRP కిరణ్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





