శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ సాయి ఎన్క్లేవ్ కాలనీలో రూ. 45 లక్షల రూపాయల అంచనా వ్యాయంతో నూతనంగా నిర్మాణం చేపట్టిన పార్క్ అభివృద్ధి పనులను జిహెచ్ఎంసి అధికారులు, కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ సాయి ఎన్క్లేవ్ కాలనీలో నూతనంగా చేపట్టిన పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని, పార్కు అభివృధి పనులలో భాగంగా పార్కు చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటవస్తువులు లాంటి సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరుతున్నదని, పార్కు అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పార్కు పనులను త్వరలో పూర్తిచేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ అన్వర్, కృష్ణ సాయి ఎన్క్లేవ్ కాలనీ వాసులు విజయ్ కుమార్, వీరేందర్, కృష్ణ చారి, సోమిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






