2బీహెచ్‌కే డిగ్నిటీ ఫ్లాట్ ఓన‌ర్స్ కాల‌నీలో ప్రీ క్రిస్మిస్ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని న‌ల్ల‌గండ్ల‌లో ఉన్న 2బీహెచ్‌కే డిగ్నిటీ ఫ్లాట్ ఓన‌ర్స్ మెయింటెనెన్స్ మాక్ సొసైటీ లిమిటెడ్ అధ్య‌క్షుడి ఆధ్వ‌ర్యంలో ప్రీ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏసుక్రీస్తు గీతాల‌ను ఆల‌పించి ప్రార్థ‌న‌లు చేశారు. అనంత‌రం ప‌లువురు చిన్నారులు ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌రానికి చెందిన ఆంధ్రా క్రిస్టియ‌న్ థియోలజీ కాలేజ్ (ఏసీటీసీ) ప్రొఫెస‌ర్ జి.నిరంజ‌న్ ప్ర‌సాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీస్తు ప్ర‌జ‌లంద‌రి ర‌క్ష‌ణ కోసం జన్మించాడ‌ని అన్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఆయుష్షును, ఆరోగ్యాన్ని అందిస్తాడ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గుల్ మోహ‌ర్ పార్క్ కాల‌నీ అధ్య‌క్షుడు షేక్ ఖాసీం, 2బీహెచ్‌కే డిగ్నిటీ ఫ్లాట్ ఓన‌ర్స్ సంఘం ఉపాధ్యక్షులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కోశాధికారి, సంయుక్త కార్య‌ద‌ర్శి, స‌భ్యులు, కాల‌నీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here