శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. భరత నాట్యాలయ గురువు శ్రీదేవి శిష్య బృందం ఈ కార్యక్రమంలో సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళాకారులు పుష్పాంజలి, గణేశ పంచరత్నం, అడవులు, శ్లోకాలు, వర్ణం, ఇందరికి భయము ఇచ్చు, భాగ్యదా లక్ష్మి, శ్రీమన్నారాయణ తదితర అంశాలను భరతనాట్య రూపంలో ప్రదర్శించారు. శాస్త్రీయ నృత్యంలోని అభినయం, హావభావాలు, తాళలయ సమన్వయంతో కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ ప్రదర్శనలో సంయుక్త, వంశిత, తరుణి, కావ్య, గ్రీష్మ, లాస్య, రన్విత, ధన్య, తిశీత, శ్రీవిద్య, సురేఖ, శాన్వి, అవంతిక తదితరులు పాల్గొని తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించారు. వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ భరతనాట్య ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here