ఆరెక‌పూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే ఇంకా ఉంటే డిసెంబ‌ర్ 21న తెలంగాణ భ‌వ‌న్‌కు రావాలి: మాధవరం రంగారావు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంబేద్కర్ ని, ఆయ‌న రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరిచింద‌ని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ రిక్షా పుల్లర్స్ కాలనీ అంబేద్కర్ విగ్రహం వ‌ద్ద స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్ర‌హానికి ఆయ‌న‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అంబేద్క‌ర్ రాసిన‌ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ, బిఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్‌లో కలిసిన‌ ఎమ్మెల్యేలు అవ‌మాన ప‌రిచార‌ని అన్నారు. స్పీక‌ర్ పై ఒత్తిడి చేసి అనర్హ‌త వేటు నుంచి తప్పించుకొని రాజ్యాంగాన్ని అవమానపరిచార‌ని, స్థానిక శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ, మిగిలిన 9 మంది శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాలు వేసుకొని, తర్వాత ప్ర‌జ‌లకు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లామ‌ని చెప్పార‌ని అన్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయ‌ని, ఇవన్నీ స్పీకర్ కి తెలుస‌ని, అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌పై ఒత్తిడి చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌ ఇలా నిర్ణ‌యం తీసుకునేలా చేశార‌ని ఆరోపించారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీపై గెలిచిన స్థానిక శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ బిఆర్ఎస్ లోనే ఉన్నారని అనుకుంటే తెలంగాణ భవన్‌లో డిసెంబర్ 21వ తేదీన జరిగే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వచ్చి పార్టీ ప‌ట్ల చిత్త‌శుద్ధిని నిరూపించుకోవాల‌ని అన్నారు. అక్కడికి రాని పక్షంలో కాంగ్రెస్ లోనే ఉన్నారని భావించాల్సి వ‌స్తుంద‌న్నారు. కాంగ్రెస్ లో ఉన్నారని అనుకుంటే బిఆర్ఎస్ సభ్యత్వానికి, బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ప్రజలకు సేవ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టిముక్కుల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, వేముల ఆంజనేయులు, జగదీష్ గౌడ్, ప్రవీణ్ , విక్రం, మధు, యశ్వంత్, రవీందర్ రావు, సత్యనారాయణ, రవి, పర్వతాలు, సతీష్ కుమార్, రామ్ చందర్, కొండలరావు, విద్యాసాగర్, జై, మల్లయ్య, శ్రీనివాస్, రాజశేఖర్, నరేష్, మల్లేష్ , రమేష్ రావు, వెంకన్న, జగదీష్, రామారావు, కె.వి. రావు, సాయి, సంతోష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here