శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఆషాఢమాస బోనాల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి డివిజన్లో బీరప్ప ఆలయంలో అమ్మవారి బోనాల మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బోనాల వేడుకలతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో సందడిగా మారాయి.







