శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు మంచి ఆరోగ్యం, ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చెరువుల సుందరీకరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న చెరువుల సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులపై వివేకానంద నగర్ లోని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చెరువులలో కొనసాగుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పనులలో అలసత్వం లేకుండా నిర్ణీత సమయంలో చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మిగతా చెరువుల అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెరువులను స్వచ్చందంగా దత్తత తీసుకొని CSR నిధులతో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. చెరువుల సుందరీకరణలో భాగంగా పటేల్ చెరువు, గంగారాం పెద్ద చెరువుల సుందరీకరణలో భాగంగా న్యాయ చిక్కులు ఏర్పడటంవలన కోర్ట్ పరిధిలో ఉండటం వలన సుందరీకరణ పనులకు ఆటంకం ఏర్పడిందని, పనులలో జాప్యం నెలకొందని, త్వరితగతిన న్యాయ వివాదాలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. TDR వంటి అంశాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూసి చెరువుల అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు EE మల్లేష్, DE రాజశేఖర్, AE గులాం మహమ్మద్, AE రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.





