శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 24 తేదీన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే శాంతియుత ధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. బీసీ జనసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద శాంతియుత (గాంధీగిరి) ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిసి కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు శివ ముదిరాజ్, బిఆర్ ఎస్వీ అధ్యక్షుడు బోవేని యుగేందర్, హెచ్ సీయూ జనరల్ సెక్రెటరీ పుత్తడి సందీప్, ఓయూ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్, బిజెపిలదే అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అలా కాదని పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చుతామని అన్నారు. బిసిలను వెంటేసుకుని పల్లకి మోసే బోయలుగా చూస్తున్నారు తప్ప వారికి రాజ్యాంగ బద్దంగా వారికి దక్కే హక్కులను హరిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న, బిసి కుల సంఘాల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి బండి రామకృష్ణ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.






