ట్రాఫిక్ ర‌హిత నియోజ‌క‌వ‌ర్గంగా శేరిలింగంప‌ల్లిని తీర్చిదిద్దుతాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మే 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ స్వామి వివేకానంద విగ్రహం నుండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు జరుగుతున్న అసంపూర్తిగా మిగిలిపోయిన సర్వీస్ రోడ్డు నిర్మాణం పనులను ట్రాఫిక్ పోలీస్, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి సర్వీస్ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులో కి తీసుకురావడం జ‌రుగుతుంద‌ని, వివేకానంద నగర్ కాలనీ స్వామి వివేకానంద విగ్రహం నుండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు ఉన్న సర్వీస్ రోడ్డు వలన కాలనీ వాసులకు ఉపశమనం ల‌భిస్తుంద‌ని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ట్రాఫిక్ CI తిమ్మప్ప, టౌన్ ప్లానింగ్ TPS మధు, ఎలక్ట్రికల్ AE చైతన్య, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చిరుమర్తి రాజు, రామకృష్ణ నగర్ కాలనీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు పురెందర్ రెడ్డి, జి నర్సింగ్ రావు, లక్ష్మీనారాయణ, కిషోర్, జి ప్రసాద్, వెంకటేశ్వరరావు, కె.వి.రావు , కొండారెడ్డి, డి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here