టీఎన్జీవోస్‌ కాలనీ లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, మార్చి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్‌ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసుల‌తో సమావేశమై ఎక్కడ ఉన్నా సమస్యలు అడిగి తెలుసుకుని కాల‌నీలో నెలకొన్న సమస్యలపై సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తమ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ నిర్మాణము పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వసతిని మెరుగుపర్చాలని, వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు.

దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్పొరోటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ పనులను, రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, మంజీర మంచీ నీటి వసతిని మెరుగుపరుస్తామని, దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి టీఎన్జీవోస్‌ కాలనీ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు.

పెరుగుతున్న జనాభా దృష్ట్యా భూగర్భ డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక‌ కాలనీ నుండి మరొక కాలనీకి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండా పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నరేందర్ రెడ్డి, డీఈ విశాలాక్షి, జి.హెచ్.ఎం.సి అధికారులు, డివిజన్ నాయకులు, టీఎన్జీవోస్‌ కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here