శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం17 వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , BK ఎన్‌క్లేవ్ కాలనీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, టెంపుల్ కమిటీ సభ్యులు సాయికృష్ణ, తిరుపతి నాయుడు, స్వామి నాయుడు వెంకటేశ్వర్లు, సదానందం, మనోహర్ సింగ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.