శిల్పా వ్యాలీ, మాధవ హిల్స్ 2 కాలనీవాసులకు అండగా ఉంటాం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు శక్తివంచన లేకుండా కృషి చేస్తాన‌ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ మాధవ హిల్స్ 2, శిల్పా వ్యాలీ కాల‌నీల‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ స‌భ్యులు నల్లగండ్ల లోని కార్పొరేటర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ ని శాలువతో ఘనంగా సత్కరించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు జవాబుదారీగా పని చేస్తున్నట్లు తెలిపారు.

అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సీసీ రోడ్డు, ఐమాస్ లైట్స్ తదితర డిమాండ్ లకు సానుకూలంగా స్పందిస్తూ శాయ‌శక్తులా కృషి చేస్తానని అన్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణను గాడిలో పెట్టాలని ఆయా విభాగాల అధికారులను ఫోన్ లో ఆదేశించారు. అనంతరం మాధవ హిల్స్, శిల్పా వ్యాలీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మాధవ హిల్స్-2 ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ గోపిచంద్, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, మెంబర్స్ సంతోష్, రామచంద్రారెడ్డి, వెంకట్, శిల్పావ్యాలీ జనరల్ సెక్రటరీ భవాని, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివాపొడిశెట్టి, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here