శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగళూరు నుండి వచ్చిన భరతనాట్య కళాకారిణి మేఖల అగ్నిహోత్రి నాట్య నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, నవరస శ్లోకం, దరువు వర్ణం, అంతఃపుర గీతం, ఆనంద నటన నాడినారు అంశాలను ప్రదర్శించి మెప్పించారు. శ్రీదేవి ప్రశాంత్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహన, బ్రహ్మాంజలి, అలరులు కురియగా, బ్రహ్మాంజలి, నారాయణతేయ్ , నమఃశివాయ , దశావతార శబ్దం, పలుకే బంగారమయేహ్న, నీలమేఘ శరీర, అదివో అల్లదిగో, కొలువైతివరంగశాయి అంశాలను ఇరా, ఊర్మిళ, గీతికా, చార్వి, దియా, నైనికా, నిషిద్ధ, జాహ్నవి, అనూష, తనుశ్రీ , గోవర్ధిని ప్రదర్శించి మెప్పించారు. కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.