మ‌ద్దికాయల ఓంకార్ శ‌త‌జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయండి: వనం సుధాకర్

శేరిలింగంపల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాజీ ఎమ్మెల్యే, సాయుధ పోరాట యోధుడు, యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ కార్యక్రమాల‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జర‌పనున్నామని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్ లోని యంసిపిఐ(యు) కార్యాలయంలో ఒక ప్ర‌క‌ట‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వనం సుధాకర్ మాట్లాడుతూ .భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రపంచం గర్వించదగ్గ జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 15 సంవత్సరాల వయసులో తుపాకీ చేతపట్టి నిజాం నవాబులకు, భూస్వాములకు, జాగిర్దారులకు, దేశముఖులకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. ఓంకార్ వీరోచిత పోరాటానికి నాటి నిజాం ప్రభుత్వం తలకు వెల కట్టిన మొక్కవోని ధైర్యంతో బానిసత్వాన్ని బద్దలుగొట్టే విధంగా పోరాటం నిర్వహించారని అన్నారు.

ఆయన రాజకీయ సైద్ధాంతిక వ్యక్తిగత అనేక అంశాలు ఈనాటి తరానికి, అన్ని వర్గాల ప్రజలకు మరింత తెలియాల‌ని, ప్రస్తుత అవినీతి అవకాశవాద రాజకీయ విధానాలను మరింత ఎండగ‌డుతూ రాజకీయ విలువలను కాపాడం కోసం ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగంగా ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం ఈ నెల 12 న వరంగల్ జిల్లా మచ్చపూర్ లోని ఓంకార్ 125 అడుగుల భారీ స్మారక స్తూపం వద్ద ప్రారంభం అవుతుందని, అనంతరం సంవత్సరకాలం రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను పార్టీ నిర్వహించడానికి నిర్ణయం చేసిందని తెలియజేశారు. మే 12న ఓంకార్ స్వగ్రామం సూర్యాపేట జిల్లా ఏపూరిలో కాగడ జ్యోతితో ప్రారంభమై, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు మచ్చాపూర్ వద్ద భారీ ప్రారంభ సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులతో పాటు కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు హాజరవుతున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here