శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీ, శ్రీరంగపురం కాలనీలలో రూ.22 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు జలమండలి DGM నారాయణ, కాలనీల వాసులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మంచి నీటి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. అత్యవసరం ఉన్న చోట, నిత్యం మంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ సునీత, నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






