శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): అమీర్ పేట్ లోని HMDA కార్యాలయంలో HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయిందని, కనుక పాఠశాల నిర్మాణం కోసం HMDA పరిధిలో స్థలం మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రూ.200కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పేద, మద్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అవకాశం లభించిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అడగగానే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకోసం బడ్జెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన తరపున, నియోజకవర్గ ప్రజానీకం తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, నియోజకవర్గ పరిధిలోని HMDA పరిధిలో ఉన్న స్థలాన్ని పాఠశాల నిర్మాణం కోసం కేటాయించాలని HMDA కమిషనర్ ని కోరడం జరిగిందని, అన్ని హంగులతో సకల సౌకర్యాలతో పాఠశాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు.






