ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ లో స్థానిక ప్రజా సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీ వీధుల్లో పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని స్థానికులు కోరారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటిని నోట్ చేసుకొని వీలైనంత త్వరగా అందుకు అవసరమైన నిధులు కేటాయించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ బస్తీల అభివృద్ధికి ఎల్లవేళలా నిధులు అందుబాటులో ఉంచి సహకరిస్తున్న కార్పొరేటర్ కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్కో కాలనీ నుండి మరొక కాలనీకి మధ్యన ఇబ్బందులు తలెత్తకుండా పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు శేఖర్, రాజు, శ్రీను, యాదయ్య, నగేష్, గోవింద్, బాబు, శ్రీశైలం, కేశవ నగర్ అధ్యక్షుడు లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు నరసింహ, యాదయ్య, ప్రధాన కార్యదర్శులు శివ, నాగరాజు, కుమార్, జాయింట్ సెక్రెటరీ గణేష్, వీరేశ్, వెంకటేష్, వంశీధర్ ,ట్రెజరర్ కర్ణ, హరి బాబు, దేవరాజ్, హనుమంతు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నవీన్, నరసింహ, పవన్, కురుమంతు, నవీన్, శివ, కార్తీక్, తరుణ్, కిట్టు, నరేష్, సురేష్, నరసింహ, కేశవ నగర్ బస్తీ వాసులు, జిహెచ్ఎంసి అధికారులు , వర్క్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ , స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here