శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో రూ. 93.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి అగ్రగామిగా తీర్చిదిద్దుతామని అన్నారు. సీసీ రోడ్ల పనులను చేపట్టడం సంతోషకరమైన విషయం అన్నారు. రోడ్లను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే గోకుల్ ప్లాట్స్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిన పనులను కూడా దశలవారిగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ , నాయకులు బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.