శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): చదువులో రాణిస్తున్న ఇంటర్ విద్యార్థినికి హోప్ ఫౌండేషన్ రూ 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ సహాయం అందజేశారు. హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చందానగర్ శాంతినగర్ కు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భార్గవికి హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 25 వేల నగదును అందచేశారు. దీంతో విద్యార్థిని, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్, సదాశివుని విజయ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.