- రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): సగరుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తే ఎంతదాకా అయినా వెళ్ళడానికి సిద్ధం అని రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి అంజయ్య నగర్ లో గ్రేటర్ హైదరాబాద్ సగర ఉప్పర సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారిల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పరి శేఖర్ సగర గ్రేటర్ హైదరాబాద్ సగర ఉప్పర సంఘం పూర్తి కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శేఖర్ సగర మాట్లాడుతూ.. సగరుల డిమాండ్‌లను నేరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, గౌరవ అధ్యక్షుడు హరికిషన్ సగర, ఉపాధ్యక్షుడు విజయేందర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, ప్రధాన కార్యదర్శి ఆస్కాని వెంకట్రాములు సగర, కోశాధికారి దిండి రామస్వామి సగర, గౌరవ సలహాదారు కేపీ రాములు సగర, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 40 ప్రాంతీయ సగర (ఉప్పర) సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.





