శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ వాసులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో గల పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ అసోసియేషన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగిందని, తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని అన్నారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని, మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. కాలనీలో దశలవారిగా అన్ని పనులు పూర్తిచేసి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. మియాపూర్ డివిజన్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండడం జరుగుతుందని, డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీల గార్డెన్ కాలనీ అధ్యక్షుడు ఫణికుమార్, అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్ కుమార్, విశ్వనాథ్, జగదీష్, జెష్వంత్, ప్రసాద్, కేశవ్ ప్రసాద్, బుచయ్య, శ్వేత, శాంతి ప్రియ, చేతన్, గోపాల్, రాఘవ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





