కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి.. బీసీ సంఘాల డిమాండ్‌..

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాల‌ని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాల‌ని ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్లమ్మ గూడెంకి చేందిన లక్ష్మీ యాదవ్, యాదగిరి యాదవ్‌కి ప్రభుత్వ రక్షణ కల్పించాల‌ని అన్నారు. యాదగిరి యాదవ్‌పై హత్యాయత్నం చేసిన రౌడీషీటర్ సందీప్ రెడ్డిపై హత్యాయత్నం కేసు, పిడి యాక్ట్‌ను నమోదు చేసి కఠిన శిక్షను విధించాల‌ని అన్నారు. యాదగిరి యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బిసి జన సభ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబ‌ర్ 5న చలో ఎల్లమ్మగూడెం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి వర్గం నుండి తొలగించడం కోసం డిసెంబ‌ర్ 10న చలో గన్ పార్క్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బిసి జన సభ, బిసి సంఘాలు, యాదవ్ సంఘాలు, ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ న‌వంబ‌ర్ 29వ తేదీన ఉదయం 9గంటల సమయంలో నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడం వాసి మామిడి యాదగిరి యాదవ్‌ను నకిరేకల్‌లో కిడ్నాప్ చేసి కారులో రోజంతా తిప్పుతూ ఓఆర్‌ఆర్ సమీపంలో ఉన్న దట్టమైన అడువులలోకి తీసుకెళ్లి దుస్తులు తీయించి నగ్నంగా చేసి చిత్రహింసలకు గురి చేశార‌ని అన్నారు. మద్యంలో మూత్రం కలిపి తాగిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా సర్పంచ్‌గా నామినేషన్ వేసే ధైర్యం మీకెక్కడిది అంటూ దాడి చేశార‌ని అన్నారు. అరే గొల్ల కుక్క అనుకుంటూ కులం పేరుతో దూశించడమే కాకుండా నామినేషన్ దాఖలు చేస్తే గతంలో విజయ్ రెడ్డిని హత్య చేసినట్టగానే హత్య చేస్తామని కత్తులతో భయబ్రాంతులకు గురి చేశార‌ని, అలాగే హత్యాయత్నం చేశార‌ని అన్నారు. ఇంత జరిగినా ఇంతవరకు నిందితులపై కేసు నమోదు చేయకపోగా బాధితుడికి న్యాయం చేయాల్సిన పోలీసులే కేసు వెనక్కు తీసుకోవాలని బాధితున్ని బెదిరిస్తున్నారని వాపోయారు. గతంలోనూ చెరుకు సుధాకర్, పున్నా కైలాష్ నేతపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటువంటి దాడుల ధోరణికే పాల్పడ్డారని, బిసి సమాజం మొత్తం ఏకమై కోమటిరెడ్డికి బుద్ది చెప్పాలన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్‌ఎస్ పార్టి సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ గతంలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అణగారిన వర్గాలపై ఇటువంటి దాడుల ధోరణే కొనసాగించారన్నారు. నల్లగొండ జిల్లాలో వెనుకబడిన కులాలు రాజకీయంగా ఎదగడం కోమటిరెడ్డి సహించలేక పోతున్నారని, గతంలోను తనపై ఇటువంటి దాడికే పాల్పడారని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటువంటి ధోరణి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో బిసిలు బుద్ది చెప్తారని హెచ్చరించారు. యాదవ హక్కుల‌ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ బిసి సమాజం బాధితులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా రెడ్డిల అహంకార ధోరణికి యాదవులు తిరగబడి వారిని రాజకీయంగా బొందపెట్టాలన్నారు. భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బాధితుని తరఫున బీసీ సంఘాలు అండగా ఉంటాయని ఇంతటి దురహంకారానికి పాల్పడిన వారిని చట్టరీత్యా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రౌడీ రాజకీయాలు రూపుమాపాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు, యాదవులు నిలబడి అత్యధిక స్థానాలు గెలుచుకొని బీసీల రాజ్యాధికారం సాధించుకునే అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.

ఈ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, బిసి సంఘాల జెఎసి అధ్యక్షుడు వోరుగంటి వెంకటేష్ గౌడ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్దర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్, బిసి కుల సంఘాల అధ్యక్షుడు కాటం నర్సింహ యాదవ్, బేరి రామచంద్రయ్య యాదవ్, కొమ్మనబోయిన సైదులు, వీరబోయిన లింగయ్య, కడారి రమేష్, నూకల మధు‌, శ్రీధర్, రమేష్ బలిజ , వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here