కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు. గురువారం డివిజన్ పరిధిలోని పాన్ మక్తాలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ పాదయాత్ర చేపట్టారు. స్థానిక ప్రజల దగ్గరకు వెళ్లి ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్ల పనులలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ కాంట్రాక్టర్లకు సూచించారు.
కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట తెరాస నాయకులు నీరుడు గణేష్ ముదిరాజ్, కోటిలింగం, ఏరియా కమిటీ మెంబర్ నాగపురి మహేష్ యాదవ్, తెరాస యూత్ నాయకులు నాగపురి సురేష్ యాదవ్, శ్రీకాంత్ ముదిరాజ్, చిన్నా గౌడ్, రాజ్ ఠాకూర్, సుభాష్, శ్రీనివాస్ గౌడ్, కాలనీ వాసులు ఉన్నారు.