చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ లో ఉన్న సర్వే నంబర్ 174లోని జవహర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిని పార్క్ కోసం కేటాయించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌కు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి వినతిపత్రం అందజేశారు. అలాగే సర్వే నంబర్ 102 పీఏ నగర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని మహిళా భవనం నిర్మాణానికి కేటాయించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ఇందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.