ఏ చిన్న స‌మ‌స్య అయినా త‌ప్ప‌కుండా ప‌రిష్క‌రిస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని తారా నగర్, శివాజీ నగర్, హుడా ఫేస్ 2, చందానగర్, గౌతమి నగర్, వేముకుంట వీకర్ సెక్షన్, ఫ్రెండ్స్ కాలనీ, భవానిపురం వీకర్ సెక్షన్ కాలనీలలో రూ.1 కోటి 81 లక్షల 45 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతాలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ , కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM శ్రీమాన్ నారాయణ, మేనేజర్ శిరీష , నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here