శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు. మియాపూర్ ఎక్స్ రోడ్డు జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ డీఈ శ్రీదేవి, ఏఈ ప్రశాంత్‌లతో కలిసి ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ బాచుపల్లి రోడ్డు వాహనదారులకు ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కోసం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మెట్రో పిల్లర్ నం.600 వద్ద ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అదనపు యు-టర్న్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వాహనదారులు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.






