UGD పైప్‌లైన్ మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోవింద్ హోటల్ చౌరస్తాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి(UGD) పైప్ లైన్ అకస్మాత్తుగా పగిలిపోవడం వలన వెంటనే చేపట్టిన పైప్ లైన్ పునరుద్ధరణ పనులను, జలమండలి అధికారులు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజి(UGD) పగిలిపోయిన విషయం తెలియగానే సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింద‌ని, చాలా సంవత్సరాల క్రితం వేసిన పాత పైపులు అవడం వలన , వాటి జీవిత కాలం తగ్గడం వలన, అకస్మాత్తుగా పగిలిపోవడం జరుగుతుంద‌ని, ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM హరి కృష్ణ, DGM నాగప్రియ, మేనేజర్ ప్రియాంక GHMC AE శ్రావణి, నాయకులు MD ఇబ్రహీం, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, గోపాల్, లింగం, సుధాకర్, సత్తయ్య, రాజిరెడ్డి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here