సగర బతుకమ్మ పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24 వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లో నిర్వహించనున్న సగర మహిళా బతుకమ్మ ఉత్సవాల పోస్టర్ ను రాష్ట్ర మంత్రులు ధనుసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర లు ఆవిష్కరించారు. తెలంగాణ సగర మహిళా సంఘం అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో సగర మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తంగడపల్లి పల్లవి సగర, కోశాధికారి సూర జయమ్మ సగర, మణికొండ సగర మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత సగర, సభ్యులు రోజా సగర, నిర్మల సగర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here