పేద విద్యార్థుల‌కు ఎల్ల‌ప్పుడూ స‌హాయం చేస్తాం: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ జెడ్పీహెచ్ పాఠశాలలో దాదాపు 120 మంది విద్యార్థిని విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్, RKY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి, ట్రస్ట్ సెక్రటరీ, ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ యాదవ్ ఉచితంగా అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు , గురువులకు మంచి పేరు తీసుకురావాల‌న్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు ,పేద విద్యార్థులకు సహాయం చేయడానికి త‌మ‌ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందంజ లో ఉంటుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాయికుమార్, సీనియర్ నాయకులు అరుణ్ కుమార్ , కృష్ణం రాజు, వేణు గోపాల్, సీతారామ రాజు, సునీల్ రెడ్డి, వీరు యాదవ్, నాగరాజు, కృష్ణ, బాలాజీ, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here