శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): గత ఎన్నో సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న గిరిజన ప్రాంతమైన నడిగడ్డ తండాలో 2016 నుండి సీఆర్పీఎఫ్ గిరిజనుల మధ్య జరుగుతున్న భూవివాదం పరిష్కారానికి జాతీయ షెడ్యూల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ పర్యటనను తమ పార్టీ పూర్తిగా స్వాగతిస్తుందని యం సి పి ఐ (యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ తెలిపారు. ప్రజల సమక్షంలో జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్, స్థానిక ఎమ్మెల్యే పి ఎస్ సి చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 50 సంవత్సరాలుగా నడిగడ్డ తండా ప్రజలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మద్దతుగా ఎంసిపిఐ( యు) అనేక పోరాటాలు చేసిందని ఇస్లావత్ దశరథ్ నాయక్ గుర్తు చేశారు.






