శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని హఫీజ్ పేట్ ప్రభుత్వ పాఠశాలని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్, యువ నాయకుడు ధాత్రి గౌడ్ సందర్శించారు. ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న పాఠశాల ప్రహరీ గోడ గురించి చర్చించారు. దీనికి సంబంధించిన వ్యక్తులతో చర్చలు జరిపారు. వారు దీనికి సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో పాఠశాల ఇబ్బందులు తొలగిపోయి ఈ స్కూల్ ని కూడా మదీనాగూడ ప్రభుత్వ పాఠశాల లాగా స్థానికంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.






