శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ అన్నారు. వినాయకచవితి పర్వదినంను పురస్కరించుకుని మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని వివేకానంద నగర్ లోని PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ కార్యలయంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి గాంధీ ప్రారంభించి ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఉచితంగా మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మట్టి వినాయకుల పంపిణీ చేపడుతూ పర్యావరణ విషయంలో తమదైన పాత్ర పోషించడం పట్ల ప్రజలు అవగహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, MD ఇబ్రహీం, పురెందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , జోగిపేట భాస్కర్, అష్రాఫ్, లక్ష్మణ్ రావు, ఆనంద్, శోభన్, అశోక్ రెడ్డి, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






